అనకాపల్లి జిల్లాలో చేపట్టిన బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, పరిశ్రమల పేరుతో అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ నిలిపివేయాలంటూ, సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు.