వినాయక విగ్రహాలను నిబంధనలు మేరకు ఏర్పాటు చేసుకోవాలని కళ్యాణదుర్గం సీఐ యువరాజు, కంబదూరు ఎస్సై లోకేష్ కుమార్ కోరారు. సోమవారం వారు వేరు వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక పండగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అల్లర్లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.డీజే లు ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. వినాయక పండుగ వేడుకలను, నిమజ్జన వేడుకలను నిబంధనలు మేరకు ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు.