కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాతీయ సోషల్ వర్క్ వారోత్సవాలు భాగంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి ఈరోజు వరకు జాతీయ సోషల్ వర్క్ వారోత్సవంలో భాగంగా సోషల్ వర్క్ విద్యార్థులు కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వృద్ధుల పట్ల మరియు అనాధ బాల బాలికల పట్ల, మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలలో సమాజం ఎదుర్కొంటున్న మానసిక, మరియు శారీరక సమస్యలపై, వాటి పరిష్కారం కొరకు అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.