నూజివీడు ట్రిపుల్ ఐటి ఆవరణములో విద్యార్థి కత్తులు దుయ్యడంతో ఎంటెక్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి గోపాలరాజుకు గాయాలైన సంఘటన సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ల్యాబ్ కు అటెండ్ కాకపోవడంతో, హెచ్ ఓ డి పర్మిషన్ కావాలి అని చెప్పినందుకు కత్తులతో దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.