అక్రమ సస్పెన్షన్ కు గురైన మహిళా కండక్టర్ పద్మాను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సూళ్లూరుపేట డిపోలో మహిళా కండక్టర్ అక్రమ సస్పెన్షన్కు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్షలకు ఆర్టీసీ ఉద్యోగులు A. R. బాబు, M. S. మన్యం, P. పెంచలయ్య సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సస్పెన్షన్కు గురైన పద్మతో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు. అక్రమ సస్పెన్షన్ తీసివేసి ఆమె వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేశారు. k. కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరా