అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు తాడిపత్రి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వచ్చాయి. తాడిపత్రి యాడికి ఎల్లనూరు పెద్దపప్పూరు పెద్దవడుగూరు మండలాల నుంచి భారీ సంఖ్యలో వాహనాలు అనంతపురానికి బయలుదేరాయి ఆర్టీసీ బస్సు లేకుండా ప్రైవేటు వాహనాల్లో టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా అన్ని సౌకర్యాలను ఎమ్మెల్యే జేసిఎస్మిరెడ్డి సీనియర్ నేత జెసి పవన్ కుమార్ రెడ్డి సమకూర్చారు. వాహనాలతోపాటు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో సభాస్థలానికి నాయకులు చేరుకున్నారు.