ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాదులో జరిగిన NMDC హైదరాబాద్ మారథాన్ పరుగు - 2025 పందెంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా పని చేస్తున్న కె. రాజశేఖర్ బాబు, జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డు గా పని చేస్తున్న జి. కృష్ణ కిషోర్ పాల్గొని సాధారణమైన 42 కిలోమీటర్ల పూర్తి మారథాన్ పరుగును కేవలం 05 గంటల్లోపే పూర్తి చేసి మెడల్స్ సాధించినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఫుల్ మారథాన్ (42 కి.మీ) లో పతకాలు సాధించిన ఏఎస్సై, హోంగార్డు లను అభినందించారు.