పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరం మార్కెట్ యార్డ్ లోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం చౌక్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలో జనసేన నాయకుడు రాట్నాల శ్రీనివాస్, న్యాయవాది జవ్వాది సత్తిబాబులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం భీమవరంలోనే కలెక్టరేట్ను నిర్మించాలని రూ.100కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తీసుకెళ్లే విధంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.