కోతులు తెచ్చిన పంచాయతీలో ఒకరిపై శుక్రవారం నాడు పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.. పోలీసుల కథనం మేరకు పాల్వంచ మండల పరిధిలోని బావోజి తండ గ్రామానికి చెందిన బాలాజీ చేలో కోతులు పడ్డాయి. ఆయన కర్రతో అదిలించడంతో పక్కన ఉన్న రాము చేలోకి కోతులు వెళ్లాయి. నీవల్లే కోతులు నా చేలోకి వచ్చాయని రాము గొడవపడి.. బాలాజీ పై కర్రతో దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. బాధితుడు ఫిర్యాదు మేరకు పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేపట్టారు..