వేటపాలెం మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు జరుబుల శ్రావణి( వేటపాలెం జడ్పీహెచ్ఎస్) బూసం లలితాంబ( కటారివారిపాలెం) జడ్పీహెచ్ఎస్) వడ్డే సంఘం ఎంపీపీ పాఠశాల హెడ్మాస్టర్ పోపూరి రంగారావు, నాయుని పల్లి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలగతోటి ఇందిర లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్టు డిఈఓ మంగళవారం ప్రకటించారు.సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే నాడు వీరిని సన్మానిస్తామన్నారు.