గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పొన్నూరులో వ్యవసాయ శాఖ అధికారులు, తహశీల్దార్ జియావుల్ హక్, సీఐ వీరా నాయక్, మండల వ్యవసాయ అధికారి కలిసి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాలను తనిఖీ చేశారు. షాపుల్లో రికార్డులను పరిశీలించి, యూరియా, డీఏపీ నిల్వలను తనిఖీ చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు.