వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే..ఎమ్మిగనూరులోని శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ధర్మకర్తలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలన్నారు.