ఆత్మకూరు పట్టణంలోని వసుంధర ఫర్టిలైజర్స్ దుకాణ గోదాములో నిల్వ ఉన్నయూరియా, ఇతరత్రా ఎరువులను జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాములో ఉన్న ఎరువులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ వ్యవసాయ, ఫర్టిలైజర్స్ దుకాణ యజమాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.యూరియా అక్రమ నిల్వలపై రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు జెసి మీడియాతో వెల్లడించారు. ప్రతి ఎకరాకు రెండు బస్తాల యూరియానుతక్షణమేఅందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులోవుందని ముందస్తు జాగ్రత్తగా అవసరానికి మించి రైతులు యూరియా తిసుకోవద్దాన్నారు