విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 35 వార్డు పెరికి వీధిలో ఓ జి జనసేన బాయ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం పాల్గొని, స్థానిక ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. జోరు వానలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసువారి సహకారంతో 5000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు.