మట్టితో చేసిన గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని రక్షించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు తెలిపారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం రామచంద్రపురం వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల వితరణ కార్యక్రమంలొ భాగంగా ముందుగా కలెక్టర్ చాంబర్ లో మట్టి గణపతి ప్రతీమను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని రక్షించాలని జిల్లా ప్రజలందరికీ తెల