నిజాంబాద్ నగరంలోని వినాయక నగర్ కు చెందిన కాంపల్లి రాములు 38 మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైనట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు అంగిటి హోటల్ నుంచి తప్పిపోవడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.సదురు వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగా లేదని ఎవరైనా గుర్తుపడితే నాలుగవ టౌన్ కు, లేదా 8712659840 నంబర్ కు సమాచారం అందించాలన్నారు.