గత పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఈవీఎంల ట్యాంపరింగ్ ను నిరసిస్తూ ఒంగోలులో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా చెప్పారు.ఇప్పటికే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవీఎంల మోసాన్ని బట్టబయలు చేశారని,ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు