సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మాస్టారు అవతారం ఎత్తారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. చింతలపాలెం మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాలను ఈరోజు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతిని పరి శీలించారు. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయుడిగా నివృత్తి చేశారు.