అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని వెంకటాద్రి పల్లి గ్రామ బస్టాప్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు విద్యుత్ సరఫరా లైన్ల వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల్లరేగాయి భయాందోళనకు గురైన స్థానికులు బస్ స్టాప్ వద్ద ఉన్న ప్రయాణికులు వెనువెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెను వెంటనే బెలుగుప్ప సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరాను నిలుపుదలు చేసి సీర్పి గ్రామ విద్యుత్ సప్లై ఫీడర్ పర్యవేక్షణ అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని 11 kv విద్యుత్ సప్లై లైన్ పై పచ్చని చెట్ల కొమ్మలు పడటంతో షార్ట్ సర్క్యూట్ జరిగిందని గ్రహించి కొమ్మలను తొలగించి సప్లై ని పునరుద్ధరించారు.