ఏలూరు జిల్లా నూజివీడు మండలం దేవరకుంట గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారని నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు రాబడిన సమాచారం మేరకు నూజివీడు రూరల్ ఎస్సై జ్యోతిబసు వారి సిబ్బంది కోడిపందాల స్థావరంపై దాడి నిర్వహించి 9 మంది కోడిపందాల రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21000 నగదు రెండు కోడి పుంజులు రెండు కోడి కత్తులను స్వాధీనం పరుచుకుని నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు రూల్ ఎస్సై జ్యోతి బసు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు