వాగులో మోటార్ సరి చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు చంద నర్సయ్య వాగు పెద్ద మత్తడిలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ వైర్లు వాగులోకి కొట్టుకొని పోవడంతో,గమనించని రైతు మోటార్ వద్దకు వెళ్లగా షాక్ తగిలి మరణించాడు. ఈ దుర్ఘటనపై స్పందించిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, రైతు కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.