విశాఖలో ఏడేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ జరుగుతుండడం ఆనందంగా ఉందని పి కే ఎల్ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం నగరంలోని ఆర్ కె బీచ్ రోడ్ లో గల నోవటల్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ మ్యాచ్ల వివరాలను ఆయన వెల్లడించారు. విశాఖలో ఏడేళ్ల క్రితం ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. ఐపీఎల్ తరహాలో కబ్బడి పోటీలను పీకేఎల్ పేరుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖలోని పోర్ట్ స్టేడియంలో ఈ మ్యాచులు ఈ నెల 29 నుండి పీకేఎల్ లీగ్ ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు జరగనున్నాయన్నారు