సూర్యాపేట జిల్లాలో ఈనెల 31న కోదాడలో జరిగే చేయూత పింఛనుదారుల నియోజకవర్గ మహాసభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు ఆ సంఘం జిల్లా ఇన్చార్జి వెంకటేశ్వర్లు అధికార ప్రతినిధి ఏపూరి రాజు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కోదాడలోని సభా ప్రాంగణాన్ని వారు పరిశీలించారు .ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని వర్గాల వారికి పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్నేహలత చౌదరి ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.