వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని నల్లబెల్లి మండల తహసిల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ వాంకుడోత్ కల్పన ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను అధికారులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని అక్రమ పనుల కోసం అధికారులను వేధిస్తున్నారని ఆరోపించారు.