యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, స్థానిక బిజెపి నాయకులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం సందర్శించి, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు నత్తనడకల నడుస్తున్నాయని, నెల రోజులు కాబోతున్న ఇప్పటివరకు కాంటాలు పూర్తి కాకపోవడం విచారకరమన్నారు. ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు.