రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. అన్నదాతలు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం తెల్లవారు జాము నుండి గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.. ఈనేపథ్యం లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం 4:00 లకు కురుస్తున్న జోరు వర్షంలో కూడా యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. అది కూడా పోలీసుల బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేస్తున్నారు.. రైతులు మాత్రం తమకు సమయానికి అందించడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడుతూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..