గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు రవి మాట్లాడుతూ డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిలభారత 18వ మహాసభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనవరి 4న జరిగే కార్మిక మహా ప్రదర్శనకు రాజధాని ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షుడు రవి విజ్ఞప్తి చేశారు.