రోడ్డు ప్రమాదంలో గవర్నమెంట్ టీచర్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నల్లవెల్లి గ్రామంలో టీచరుగా పనిచేస్తున్న బట్టు శ్రీరాములు బైక్ పై వెళుతుండగా రంగాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పోలీసు అధికారులు వెల్లడించారు.