జులై 30 వ తేదీ రాత్రి కొందరు యువకులు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు నిర్వహించారని గుంటూరు ఈస్ట్ డిఎస్పి అజీజ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా డిఎస్పీ అజీజ్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజా శాంతికి భంగం కలిగించిన యువకులను పాత గుంటూరు సీఐ వెంకట ప్రసాద్ అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. పుట్టినరోజు వేడుకలు లేదా మరి ఏదైనా వేడుకలు నిర్వహిస్తూ ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా రోడ్లపై వాహనాలు నిలిపివేసి వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు