తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్లో గిడుగు రామ్మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు భాష తియ్యదనాన్ని సామాన్యుడికి అందించిన ఘనత రామ్మూర్తికి దక్కుతుందన్నారు. వాడుక భాష ఉద్యమానికి ఆయన ఆద్యుడు అన్నారు.