తీరొక్క పూలతో తెలంగాణ బతుకమ్మ చరిత్ర సృష్టిస్తే తీరొక్క సమస్యలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని, అలవి కాని హామీలు ఇచ్చి, బూటకపు మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఏఎంసీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పాల సాయిరాం అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి మూడు జెండాలు కింద పని చేశాడు క