జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కులం నుండి కుల పెద్దలు బహిష్కరించారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పుల్లతో దండోర వేయించారు. ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25 వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5 వేల నజరానా కూడా ప్రకటించేశారు.