చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు త్రివంగా గాయపడ్డారు. పలమనేర్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ చెందిన కృష్ణప్ప కుమారుడు కన్నయ్య 45 సంవత్సరాలు కుడికాలు విరిగిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామని నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన గురువారం సాయంత్రం 6 గంటలకు వెలుగులో వచ్చింది.