అనకాపల్లి జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. లక్క పల్లెలో మంగళవారం నాడు కాపు కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణను నక్కపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అన్నదాత పోరు కార్యక్రమానికి వెళుతున్న రామకృష్ణను పోలీసులు అడ్డుకొని రామకృష్ణను అరెస్టు చేశారు. మరోపక్క చోడవరం మాడుగుల పాయకరావుపేట ఎలమంచిలి నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంపీపీలు ,జడ్పిటిసిలతోపాటు సర్పంచులు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.