జిల్లాలో ఈనెల 5,6 తేదీల్లో అంగరంగవైభవంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ అన్నారు. ఈరోజు ఎస్పీ నర్సింహ తో కలిసి వినాయక నిమజ్జనం జరిగే సూర్యాపేట సద్దుల చెరువును సందర్శించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్, పెద్ద క్రేన్లు, చిన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.