జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న నల్ల సంజీవరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సంజీవరెడ్డి మండలంలోని గంభీర్పూర్,అంబర్పేట జడ్పీ హైస్కూళ్లలో సంజీవరెడ్డి ఇంగ్లీష్ టీచర్ గా వినూత్నంగా బోధిస్తూ విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారని ఉపాధ్యాయులు తెలిపారు.ఆయనకు అవార్డు రావడం పట్ల ఆదివారం మండల గ్రామ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు అభినందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.