బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో బుధవారం ముసురు వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా పనుల కోసం బయటికి వెళ్లే ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వీధి వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.