విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కడప నగరంలోని స్థానిక బాలుర ఎస్సి హాస్టల్ నందు ఎస్ఎఫ్ఐ ఛలో కలెక్టరేట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ.. ఆగస్టు 25న విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడుస్తున్న కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదన్నారు.