ఉద్యోగ ఉపాధ్యా యులకు పాత పెన్షన్ విధానం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉద్యోగ ఉపాధ్యా యుల జేఏసీ జిల్లా ఛైర్మన్ జావీద్ అలీ అన్నారు. సంగారెడ్డిలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానం రద్దు చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు.