ప్రజల వేగంగా న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యతని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు, సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, వేగంగా ఫిర్యాదుదారులకు పరిష్కారం చూపించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.