యూరియా కోసం రైతన్నలు క్యూ కట్టి దర్శనమిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో గల మన గ్రోమార్ కేంద్రం వద్ద రైతులు శనివారం యూరియా కోసం బారులు తీరారు. గత కొన్ని మాసాలుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారని కథనాలు మనం చూస్తున్నాం.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని రైతుల యూరియా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. పంట ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించే యూరియా దొరకపోవడంతో రైతన్నలు అవస్థలు పడుతున్నారు.