Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
కరేడులో ఇండోసోల్ కంపెనీకి వేల ఎకరాలు కట్టబెట్టడంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు మండిపడ్డారు. అభివృద్ధి అంటే పచ్చని పంట పొలాలను నాశనం చేసి వేల మంది రైతులకు, కూలీలకు ఉపాధి లేకుండా చేయడమేనా అంటూ ఎద్దేవా చేశారు. భూములు కేటాయించే ముందు ఆ కంపెనీల విలువలు పరిశీలించే అవసరం లేదా అని ప్రశ్నించారు. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్లు పరిశ్రమలు పెడతామన్నా భూములిస్తారేమో.. అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.