విజయనగరం జిల్లా జామి మండలంలోని సిరికిపాలెం వద్ద ఆదివారం రాత్రి సుమారు 7:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఎదురుగా అతి వేగంతో వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ఘటనస్థలిలోనే చనిపోయారు. చనిపోయిన ఇద్దరూ సిరికిపాలెం గ్రామానికి చెందిన బోని సాగర్, భీమాలి గ్రామానికి చెందిన సురేష్ గా స్థానికులు గుర్తించారు. . కాగా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.