జిల్లాలోని పొన్నూరుకు చెందిన తనకు గత ఏడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగిందని నంబూరు వెంకటేశ్వరమ్మ అనే మహిళ తెలిపింది. వివాహం అయినప్పటికీ నుండి ఇప్పటివరకు తన భర్త మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదని చెప్పింది. తనకు ఒక కుమార్తె పుట్టిన ఇంతవరకు బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకోలేదని తెలిపింది. కేవలం తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి కోసమే తన భర్త వివాహం చేసుకొని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.