బోధనభ్యాసన ఉపకరణాలు ఉపాధ్యాయులకు ఆయుధాల వంటివని, విద్యార్థులకూ జ్ఞానాన్ని సులభంగా అందించే సాధనాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ అన్నారు.నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం మండల స్థాయి టిఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధన అభ్యసన ఉపకరణాలను DEO పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఏ అంశంపై బోధిస్తున్నారో ఆ అంశానికి సంబంధించిన టి ఎల్ ఎంతో తరగతి గదిలోకి వెళ్లాలని సూచించారు.