జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం భూషణరావుపేట శివారులో రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువకు గురువారం గండి పడింది. మండలంలో గురువారం భారీగా వర్షం పడడంతో రాళ్లవాగు ప్రాజెక్టు కుడి కాలువలో నీటి ఉధృతి పెరిగింది. వర్షపు నీరు కాలువలో నిండుగా నిండి పక్కకు పొర్లడం వల్ల కాల్వకు గండి పడినట్లు రైతులు తెలిపారు. కాల్వకు గండిపడడంతో సమీపంలోని వరి పొలాల్లో నీళ్లు చేరి నష్టం చేశాయని రైతులు వాపోతున్నారు. త్వరగా గండి పూడ్చాలని కోరుతున్నారు.