జగత్ ప్రవక్త “మహమ్మర్ సల్లెల్లాహూ ఆలేహీ వసల్లం” 1500వ జన్మదిన వేడుక ఈ నెల 5న విశాఖపట్నం జిల్లా సిరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సీరత్ కమిటీ అధ్యక్షులు మునీర్ ఖాన్ బాబా తెలియజేశారు. బుధవారం డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ మాట్లాడారు. ఈ నెల 5 న జరుగు శాంతి ర్యాలీలో మహమ్మద్ ప్రవక్త భోదనలు ప్రచారం చేస్తామన్నారు. మహమ్మద్ ప్రవక్తను విశ్వప్రవక్త- సమస్త మానవజాతికి మార్గదర్శిగా దైవం నియమించారని తెలిపారు. వారు భోదించిన భోధనలు, సర్వ మానవాళికి సమానత్వము, ఐక్యత, సోదర భావము, మానవుని కర్తవ్యం అన్నారు.