కూలిపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని వైసీపీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్,మాజి మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట కొట్టుకుపోయిన వంతెనను మాజీమంత్రి అమర్నాథ్, స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. వందలాది గ్రామాలకు చెందిన ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాత్కాలిక కాజ్ వే కూడా నిర్మించలేదని మండిపడ్డారు.