కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన కరివేపాల బాలరాజు( 50) సంవత్సరాలు అనే రైతు వరదల్లో కొట్టుకపోయి చివరకు ఆదివారం రోజు కాల్వలో శవమై కనిపించినట్లు పోలీసులు ఎస్సై రంజిత్ తెలిపారు. ఈనెల 27వ తేదీన బాలరాజు తన ఇంటినుండి బయటకు వెళ్లి కనిపించలేదు, అతని మృతదేహం జి.ఆర్ కాలనీ సమీపంలో కాలువలో కనిపించిందని, అతను వరద నీటిలో కొట్టుకుపోయి మరణించినట్టుగా అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.