Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల కోసం సీపీఎం కార్య దర్శి పసుపులేటి పెంచలయ్య ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ధర్నా చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఆర్డీవో వంశీకృష్ణను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని ఆర్డిఓ హామీ ఇచ్చారు.